ఏలూరు: 04 ఫిబ్రవరి : ‘సిద్ధం’ సభ కవరేజీకి హాజరైన మీడియా ప్రతినిధులపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.
సీఎం ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా మీడియా గ్యాలరీలోకి ప్రవేశించారు.
మద్యం మత్తులో విలేకరులపై పడి వికృతంగా ప్రవర్తించారు. బయటికి వెళ్లాలని కొందరు చెప్పటంతో ‘మీరెవరు మాకు చెప్పడానికి’ అంటూ దూసుకొచ్చారు. ప్రతిఘటించిన వారిని తోసేయడంతో పలువురు విలేకరులు కింద పడి గాయపడ్డారు.
