అమరావతి,27 ఫిబ్రవరి : వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇన్‌చార్జిగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం ఎవరికి దక్కుతుందోనని ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సర్వేలను బేరీజు వేసుకొన్న టీడీపీ నాయకత్వం వసంత వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు.
నియోజకవర్గంలో పని చేసుకోవచ్చని అధిష్ఠానం తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వసంత సోమవారం ఆ నియోజకవర్గ నేతలకు తెలిపారు. ఆదివారం సాయంత్రం చంద్రబాబును దేవినేని ఉమ కలిసి మాట్లాడిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకొంది.
