వారణాసి ,24,జనవరి (హిం.స) జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదంలో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును బహిరంగపరచాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక హార్డ్ కాపీలను ఇరు వర్గాలతో పంచుకోవాలని కోర్టు ఏఎస్ఐకి సూచించింది. డిసెంబర్ 19న ఏఎస్ఐ తన సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించింది. మసీదు హిందూ ఆలయంపై నిర్మించారా..? లేదా? అని తెలుసుకునేందుకు భారత పురావస్తు శాఖను సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఏఎస్ఐ ఆ ప్రాంతంలో సర్వే చేస్తోంది. ఏఎస్ఐ 1500 పేజీల సర్వే రిపోర్టును రెండు వర్గాలు జనవరి 25న పొందే అవకాశం ఉంది.
