తెలంగాణ : హైదరాబాద్ :అక్టోబర్ 14 : హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో మర్రి ప్రవళిక (23) అనే విద్యార్థిని గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. వరంగల్ జిల్లా బిక్కాజి పల్లికి చెందిన ప్రవళిక అశోక్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం గదికి వచ్చిన తోటి విద్యార్థులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలిసి ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రూప్ 2 అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. పరీక్ష వాయిదా పడినందుకు మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
