తిరుమల 13 అక్టోబర్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
గురువారం స్వామివారిని 65,937 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
