తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ మార్చ్ నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కృషి గత ప్రభుత్వం పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇస్తున్నామని ప్రగల్బాలు పలికి అనర్హులకు ఇళ్ళను కేటాయించేందుకు సర్వశక్తులు వడ్డారని అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు అవకతవకలు వెలుగు చూశాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్భంగా ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా నేటికీ తన దృష్టికి రాలేదని చెప్పారు. గత పాలకులు అధికారులు కలిసి ఏం చేశారో మీడియా కూడా అప్పట్లో ప్రశ్నించలేదని అన్నారు. ఇష్టారాజ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో పేర్లు రాసుకొని లబ్ధిదారులకు చెప్పారని అదంతా బోగస్ కేటాయింపులని ఎమ్మెల్యే కొట్టి పారేశారు. నిజమైన అర్హులను గుర్తించి వారికి ఇల్లు కేటాయిస్తామని అన్నారు. ఈ అంశం అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. పేద ప్రజలు సంక్షేమం కోసం అవసరమైన ఇళ్లను వారి కేటాయించకుండా అర్హత లేని వారికి ఇస్తే దాని ఉద్దేశం మారిపోతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 3500 ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. ఇళ్ల కేటాయింపు విషయంలో మీడియా సహకారం కూడా ఎంతో ఉంటుందని మీడియా ప్రతినిధులు కూడా ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.
మీడియా పరంగా లోపాలను ఎత్తిచూపడం ఎంతో మంచి విషయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు మీడియా ప్రతినిధులు అడగండి కడగండి అంటూ మీడియాకు ధైర్యంగా సూచించారు. ఇలాంటి విషయాలను నేను మీడియా తనతో పసుపుటంగా విషయాలు పంచుకోవచ్చని తనకు తెలిసింది చెప్తానని తెలియనిది చెప్పానని అన్నారు. మీడియా అంటే తనకు ఎంతో గౌరవం అని వారిని ఎప్పుడు తప్పు పట్టే ప్రసక్తే లేదని నా సొంత వారిగా చూసుకుంటానని వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. వాస్తవాలు అక్కడక్కడ మీడియా రాస్తున్నప్పటికీ దానిపై తనకు ఎలాంటి విభేదం లేదని నన్ను విమర్శించిన వాస్తవాలు బయటికి చెప్పిన వారిని అభినందిస్తానని వీళ్ళపల్లి శంకర్ చెప్పారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ రఘు చెంది తిరుపతి రెడ్డి చెన్నయ్య బాలరాజ్ గౌడ్ రాజు కృష్ణారెడ్డి చంద్రశేఖర్ శ్రీకాంత్ రెడ్డి పురుషోత్తం రెడ్డి మహబూబ్ ముబారక్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
