అమరావతి, : టెట్ , డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి (AP Government) హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తున్నాయని , మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్లో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణకు రాగా… పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర వాదనలు వినిపించారు.
