తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ మే : సంస్కార భారతి జాతీయ సామాజిక ,సాంస్కృతిక సేవా సంస్థ షాద్ నగర్ శాఖ ఆధ్వర్యంలో బాలల రంగస్థల నట శిక్షణ శిబిరాన్ని నాడు యోగా సెంటర్ షాద్ నగర్ నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బండారు రమేశ్ పై విధంగా అన్నారు. చిన్నారులకు చదువొక్కటే ప్రధానం కాదని సభ్యత, సంస్కారం, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను, తోటివారిని గౌరవించడం, అభిమానించడం, సహాయం చేయడం లాంటి మంచి విలువలను నేర్పించాల్సిన భాధ్యత మన అందిరి పైన ఉందని ఇవి స్కూల్స్, ఇళ్లలో పెద్దలు, ఇలాంటి శిక్షణ శిబిరాల్లో నేర్పించి ఉత్తమ పౌరులను తయారు చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు .నట శిక్షణ శిబిరం ప్రోగ్రాం డైరెక్టర్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్, సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ.వీ.రంగయ్య మాట్లాడుతూ నట శిక్షణ శిబిరంలో చిన్నారులకు నటనలో మెలకువలతో పాటు పదిమందిలో ధైర్యంగా మాట్లాడ గలగడం భావ వ్యక్తీకరణ, నీతికథలు , పద్యపఠనం, చిత్ర లేఖనం, సృజనాత్మకత ,వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే పలు అంశాల్లో అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వబడును అని అన్నారు . బాలలు రేపటి ఉత్తమ భావి భారత పౌరులు గా రూపొందాలంటే వారిలో దాగివున్న వివిధ రకాల నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. మరో అతిథి సామాజిక, సాంస్కృతిక సేవకులు సంస్కార భారతి గౌరవ సలహాదారులు బెజుగం రమేష్ మాట్లాడుతూ చాలా మంది యువత ఉన్నత విద్యావంతులు అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు వేదికమీద తమ భావాలను సరైన రీతిలో వ్యక్తపరచలేక పోతున్నారని కారణం వారు కేవలం పుస్తక పఠనం కు ఇచ్చిన ప్రాధాన్యత ఆటలు పాటలలో సరిగ్గా పాల్గొనక పోవడమే. చిన్నారులకు చదువుతో పాటు మన సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ కళలలో పరిచయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సంస్కార భారతివారుతమజీవితాన్ని సాంప్రదాయ ,జానపద సంగీతానికి ,కళల పరిరక్షణకు విశేష కృషి చేసి కేంద్ర ప్రభుత్వం చే ఉన్నత గౌరవ పురస్కారమైన పద్మశ్రీ పురస్కార గ్రహీతల ముఖచిత్రాలతో రూపొందించిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది నుంచి ఉగాది కాలమానిని పెద్దలు బండారు రమేష్ బెజుగం రమేష్ సింగారం.శ్రీనివాస్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సింగారం శ్రీనివాస్ మాజీ సర్పంచ్ హాజిపల్లి వి.హెచ్.పి.ప్రఖండ కార్యదర్శి శ్రీ బాల బ్రహ్మచారి, హిందూ వాహిని రాష్ట్ర కార్యవాహ సభ్యులు శ్రీ చెట్ల వెంకటేష్ సలావత్, రవీందర్ శివ డ్యాన్స్ మాస్టర్ ,సంస్కార భారతి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ,వడ్ల రమేష్ చారీ సంస్కార భారతి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వీరేశం సరస్వతీ శిశు మందిరం సంరక్షక్ శ్రీమతి వడ్ల ప్రణీత సంస్కారభారతి సభ్యురాలు దాదాపు 50 మంది చిన్నారులు పాల్గొన్నారు..
