తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 1( హింస)
సైబరాబాద్ పోలీసులు నేటి నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్-ఎక్స్ నిర్వహించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు సీపీ కార్యాలయంలో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ, కూడళ్లలో సరుకులు విక్రయిస్తున్న వారితో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్న చిన్నారులను రక్షించి వారికి పునరావాసం కల్పించేందుకు సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లతో 11 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ డబ్ల్యూఅండ్ సీఎస్డబ్ల్యూ డీసీపీ ఎల్సీ నాయక్ తెలిపారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
