దిల్లీ 14,,,, అక్టోబర్ : ఇజ్రాయెల్ – హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీంతో ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో విడతలో మరో 235 మంది భారతీయులతో కూడిన విమానం శనివారం ఉదయం దిల్లీ చేరుకుంది.
తెల్లవారుజామున స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్ స్వాగతం పలికారు. హమాస్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నుంచి తమను సురక్షితంగా భారత్కు తీసుకురావడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
