తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ ఏప్రిల్ఎ క్కడ చూసినా వీది కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.. కనిపించిన వాటిపై మూకుమ్మడిగా దాడికి దిగుతూ రెచ్చిపోతున్నాయి. ఇదే క్రమంలో ఫరూఖ్ నగర్ మండలం కొండన్న గూడ గ్రామంలో గున్న మల్లయ్యకు చెందిన మేకల మందపై ఆదివారం రాత్రి కుక్కల గుంపు విరుచుకు పడింది. మందలో ఉన్న 15 మేకలపై దాడి చేసిన ఘటనలో అవి మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ. 3 లక్షల వరకు వుంటుందని, ప్రభుత్వం తనకు ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలని రైతు వేడు కుంటున్నాడు.
