ముంబయి: ఏప్రిల్ దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల పవనాలు, ముడి చమురు ధరలు దిగిరావడం వంటి సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 340 పాయింట్లు లాభపడి 73,428 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 22,252 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 వద్ద ప్రారంభమైంది.
సెన్సెక్స్-30 సూచీలో జేఎస్ డబ్ల్యూ స్టీల్, హెచ్ఎడీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టి, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభ పడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
అమెరికా మార్కెట్లు గత వారాన్ని నష్టాలతో ముగించాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలులాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 86.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం నికరంగా రూ.129.39 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు ‘ రూ.52.50 కోట్ల స్టాక్స్ను విక్రయించారు.
