తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ జనవరి 19(హిం స)
ఓటరు సంక్షిప్త సవరణ 2024లో భాగంగా ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు షాద్ నగర్ నియజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు షాద్ నగర్ ఆర్డీఓ వెంకట మాధవ రావు తెలిపారు. శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఫరూక్ నగర్ తాసిల్దార్ పార్థ సారధి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్డీవో వెంకట మాధవరావు మాట్లాడుతూ.. 2024 జనవరి 1 ప్రామాణికంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలు, దరఖాస్తులు పరిశీలించి 8న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
జనార్థన్ రెడ్డి, హిందుస్థాన్ సమాచార్
