అమరావతి, జనవరి 9(హిం.స)): ఎన్నికల ముందు అంతన్నాడు… ఇంతన్నాడు. అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్నీ చేసేస్తానని డాంబికాలు పలికాడు. చివరాఖరికి అందర్నీ నిట్టనిలువునా ముంచేశారు. జగనన్న ఏదో చేసేస్తాడని నాలుగున్నరేళ్లు కళ్లుకాయలు కాసేలా చూసిన ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన బాట అవుతున్నారు. ఆశా వర్కర్ల దగ్గర నుంచి 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులతోపాటు ఆయుష్ ఉద్యోగులు కూడా ఉద్యమ బాటపడుతున్నా రు. ఆశా వర్కర్లకు అధికారంలోకి రాగానే రూ.10 వేల వేతనం ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఆమేరకు పెం చుతున్నట్లు పేపర్ల మీద చూపించారు. కానీ ఎవరికీ నెలవారీగా రూ.10 వేలు ఖాతాల్లో పడిన దాఖలాలు లేవు. పైగా ఇన్సెంటివ్స్ ఆధారంగానే పది వేలు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. గర్భిణీలను రిజిస్ట్రేషన్ చేయిస్తేనో, ఆస్పత్రులకు రిఫరల్స్‌కు తీసుకువెళ్తే ఇలా ఇన్సెంటివ్ ఆధారంగానే పది వేలు వచ్చేలా నిబంధనలు రూపొందించారు. దీంతో ఆశా వర్కర్లు ఎంత కష్టపడినా వారికి నెలకు రూ.10 వేలు వచ్చే పరిస్థితి లేదు. పైగా ఆశా వర్కర్లపై పని భారం పెంచేశారు. ఫీవర్ సర్వే, జగన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ అంటూ ఆశా వర్కర్లపై పని భారాన్ని మోపుతున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
