







ఆంధ్రప్రదేశ్ : జనవరి 5 ( హిం స ) సంక్రాంతి పండగను పురస్కరించుకుని మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.
ఊరూరా జరుగుతున్న పోటీల్లో భాగంగా గురువారం రాజుపాలెం మండలం బీరవల్లిపాయ గ్రామంలో ఓ బాలిక జనసేన ముగ్గు వేసింది. వైసీపీ వద్దు- జనసేన ముద్దు అంటూ జనసేన పార్టీ గుర్తుతో రంగవల్లి తీర్చిదిద్దింది. ఇది మండలంలో చర్చనీయాంశమైంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
