దిల్లీ,0 5 జనవరి (హిం.స)పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. టీఎంసీ నేత షాజహాన్ షేక్ రహస్య స్థావరంపై దాడి చేసేందుకు ఈడీ బృందం వచ్చింది. ఆ తర్వాత దాదాపు 250 నుంచి 300 మంది గ్రామస్తులు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ బృందం గాయపడింది. టీఎంసీ నేతలకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు ఈడీ కారు అద్దాలను పగులగొట్టారు.
కేంద్ర బలగాలతో టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంటికి ఈడీ చేరుకుని అతడి ఇంటి తాళం పగులగొట్టింది. దీంతో గ్రామస్తులు గుమిగూడి ఈడీ బృందంపై దాడి చేశారు. ఆ ప్రాంతం నుంచి ఈడీ టీమ్ ను తరిమికొట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే, ఈ దాడిని ప్రొత్సహించిన టీఎంసీ నేతలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనలో ఎవరైన ప్రమేయం ఉన్నా శిక్ష పడాల్సిందే అని ఈడీ అధికారులు చెప్పుకొచ్చారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
