







నంద్యాల:12 జనవరి (హిం.స) శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18న ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని, ప్రధాన వీధులను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.
అలాగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు స్వాగతం పలుకుతూ శ్రీశైలం ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు రహదారి మార్గంలో స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
