విశాఖపట్నం 15 అక్టోబర్ : రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత విశాఖపట్నంలో ఐటీ పరంగా చేసింది శూన్యం..! జగన్ ప్రభుత్వ ప్రమేయంతో ఒక్క కంపెనీ కూడా రాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
అప్పటికే ఉన్న కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీ మొత్తం రూ.22 కోట్లలో రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కోడ్ ముగియగానే రాయితీలు ఇస్తామని ఐటీ మంత్రి అమర్‌నాథ్ ప్రకటించారు. ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. ఇంజనీరింగ్ పట్టభద్రులకు స్థానికంగా మంచి ఉద్యోగావకాశాలే లేవు. ఉత్తరాంధ్రలో చదువు పూర్తయినవారు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళ్లిపోతున్నారు.
