అమరావతి, 8 ఆగస్టు (హి.స.)ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి పండుగను జరుపుకుంటారు.
ఈ రోజున మహిళలు ఉపవాసం ఉంటూ దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని వరలక్ష్మీ వ్రతం చేస్తారు.
సిరుల తల్లి లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని వారి నమ్మకం. ఈ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహాలక్ష్మి మీ ఇంటిల్లిపాదికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్య, ఆనందాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
