దిల్లీ, 12, జనవరి (హిం.స)భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో ఎర్ర సముద్రంలో సవాలుగా మారతుతున్న భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో పాటు ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక, జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ వేదికగా (‘X’) ఇలా వ్రాశాడు.. నా స్నేహితుడు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్తో నేను సంభాషణ చేసాను.. మా చర్చలు ముఖ్యంగా ఎర్ర సముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లపై దృష్టి సారించాం.. గాజాతో సహా పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించామని పేర్కొన్నారు. కాగా, అలాగే, జైశంకర్ తో ఆస్ట్రేలియా కౌంటర్ పెన్నీ వాంగ్తో కూడా ఫోన్లో మాట్లాడారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
