హైదరాబాద్, 10 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. వారికి సంబంధించిన వివరాలను డీజీపీ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య అలియాస్ రమేశ్, తోడెం గంగ అలియాస్ సోనీ (ఛత్తీస్గఢ్), మొగిలచర్ల చందు అలియాస్ వెంకట్రాజు లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. మావోయిస్టులు లోంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారు. ఆపరేషన్ కగార్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు అనేకమంది లొంగిపోయారని.. మిగిలిన వాళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
