తిరమల, 10 జనవరి (హిం.స)
టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని ఎస్వీయూ నూతన వీసీ శ్రీకాంత్ రెడ్డి ఈ రోజు బుధవారం ఉదయం తిరుపతిలోని పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం సమర్పించి, దుశ్శాలవతో సత్కరించారు. ఎస్వీయూ నూతన వీసీగా భాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్ రెడ్డిని భూమన కరుణాకర రెడ్డి దుశ్శాలువతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
