తిరుమల, 8 ఆగస్టు (హి.స.)
,:శ్రీవాణి టికెట్ల జారీలో నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు టోకెన్ విధానాన్ని టీటీడీ ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటలకు టికెట్లు కేటాయించేదాకా క్యూలైన్‌లో ఉండే అవసరం లేకుండా వచ్చినవారికి వచ్చినట్టుగా అన్నమయ్య భవనం ఎదురుగా ఉండే శ్రీవాణి కౌంటర్ వద్ద టోకెన్లు ఇస్తున్నారు. ఈ సమయంలోనే భక్తుల ఆధార్ జిరాక్స్‌పై సంతకం చేసి స్టాంప్ వేస్తారు. టోకెన్లు పొందినవారు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30లోగా ఎప్పుడైనా కౌంటర్ వద్దకు వచ్చి టికెట్ కొనుగోలు చేయచ్చు. సాయంత్రం 4.30కి వీరిని దర్శనానికి అనుమతిస్తారు. ఇందువల్ల క్యూలో వేచివుండే అవసరం లేకుండా పోయింది. రానున్న రోజుల్లో టోకెన్ బదులుగా చేతికి కంకణం వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
