హైదరాబాద్, 7 జూలై (హి.స.)
పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో సోమవారం ఉదయం బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 10 మంది మరణించగా, కనీసం 32 మంది గాయపడ్డారు. దసుయా ప్రాంతంలోని దసుయా-హాజీపూర్ రోడ్డులోని సాగ్రా అడ్డా సమీపంలో ఈ సంఘటన జరిగింది. బస్సు నియంత్రణ కోల్పోవడంతోనే బోల్తా పడిందని పోలీసులు చెప్పారు.. గాయపడిన వారిని చికిత్స కోసం దసుహాలోని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు.బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహాయం కోసం కేకలు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. పోలీసులను అప్రమత్తం చేసి, అంబులెన్స్‌లను వెంటనే రప్పించారు. పోలీసు బృందాలు, స్థానికుల సహాయంతో, గాయపడిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
