తిరుమల, 19 ఆగస్టు (హి.స.) నంద్యాలకు చెందిన ‘మనఊరు-మనగుడి-మనబాధ్యత’ సంస్థ వ్యవస్థాపకుడు శివకుమార్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది సేవకులు దేశంలోని వివిధ క్షేత్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా టీటీడీ అనుమతి తీసుకున్న వీరు..ఈ నెల 12వ తేదీ నుంచి రేపటి వరకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాలు, శిలాతోరణం, వేదపాఠశాల వంటి వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరిస్తున్నారు.
ప్రధానంగా ప్లాస్టిక్ తొలగింపుపై దృష్టిసారించి వారంరోజుల్లో 3 నుంచి 4 టన్నుల చెత్తను సేకరించి తొలగించారు. ఈసందర్భంగా ఫౌండర్ శివకుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ..తాను ఓ ప్రభుత్వ ఉద్యోగినని, కొంతకాలంగా వారణాశి, అరుణాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చెత్తను తొలగిస్తూ సేవ చేస్తున్నామన్నారు.ఇందులో భాగంగా తిరుమలలోనూ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
