మంత్రాలయం, 24 డిసెంబర్ (హిం.స)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఈ రోజు ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
ముందుగా దర్శనార్థం మంత్రాలయం కు వివిధ రాష్ట్రాల భక్తులు వరుసగా ఐదు రోజుల సెలవు దినాలు కావడంతో అధిక సంఖ్యలో తరలివచ్చారు. వీరు ముందుగా తుంగభద్ర నదిలో స్థాన్నాలు ఆచరించి అనంతరం గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
