అమరావతి, జనవరి 23: (హిం.స)ఏపీ ఓటర్ల తుది జాబితాపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశామన్నారు. నిన్న (సోమవారం) విడుదల చేసిన తాజా జాబితా కూడా తప్పులతడకగా ఉందని మండిపడ్డారు.
మంగళవారం విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్మదర్శి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎంపీ పార్ధసారధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
