కడప, 26 డిసెంబర్ (హిం.స)
ధనుర్మాసం పదవరోజు, మార్గశిర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మంగళవారం ఉదయం కడప నగరంలోని గడ్డి బజార్ బాలాజీ గుడిలో శ్రీ గోదా సమేత శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి విశేషంకర్యంలో భాగంగా తిరుప్పావై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
