ఢీల్లీ, 26 డిసెంబర్ (హిం.స)
నేడు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం రేవంత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తొలిసారి సమావేశం కానున్నారాయన. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో కూడా చర్చలు జరుపుతారు రేవంత్.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారిగా నేడు ప్రధాని మోదీని కలుసుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు రేవంత్కు ప్రధాని సమయం ఇచ్చారు.
ప్రధానితో రేవంత్ భేటీ మర్యాదపూర్వకమే అయినా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్ల గురించి అడిగే అవకాశముంది. విభజన చట్టంలోని నిబంధనల మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
