







అమరావతి : 12 జనవరి (హిం.స) మంత్రి జోగి రమేష్ కు కోరుకున్న సీటు దక్కలేదు. అటూ ఇటూ కాకుండా పెనమలూరు సీటు కేటాయించారు.
ఆయనను పెనమలూరు ఇన్‌ఛార్జిగా నియమించారు. ఊహించినట్లే జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త ఉప్పాల రాముకు పెడన నియోజకవర్గం కేటాయించారు. వైకాపా మూడో జాబితా గురువారం రాత్రి ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఎంపీ స్థానానికి, రెండు అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
