తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 13( హింస)
తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన వారి నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు గాను దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అందులో.. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్-సైట్ లో ఉంచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్-లైన్, ఈ-మెయిల్ [email protected] ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
