







అమరావతి 11 జనవరి (హిం.స)రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన అభ్యర్థులపై కసరత్తు పెంచింది.
సంక్రాంతి సమయానికి 20-25 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. తొలి జాబితాలో పెద్దగా సంచలనాలేవీ ఉండబోవని, ఖాయంగా పోటీ చేసే నేతల పేర్లే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేశ్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు వంటి వారి పేర్లు తొలిజాబితాలో ఉంటాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి ఉండేలా ఈ జాబితా కూర్పు ఉండబోతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ అంతర్గత కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై ఆ పార్టీ నాయకత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవీఆర్‌ఎస్ విధానంలో ఆయా నియోజకవర్గాల్లో ఫోన్ సర్వే చేస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
