తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 4( హింస)
అవయవాలు లేవని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మలక్ పేట్ దివ్యాంగులు భవన్ లో ఘనంగా లూయిస్ బ్రెయిలి 215 జన్మదిన వేడుకలకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా అంథుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తో రూపొందించిన ల్యాప్ టాప్ లు, ఫోన్ లను అంథులకు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్ళు లేని వారికి ప్రపంచాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలి గొప్ప వ్యక్తి అని అన్నారు. లూయిస్ బ్రెయిలి జీవితంను అందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లిపి కనుక్కోని కళ్ళు లేని వారికి బ్రెయిలి కనుచూపు అయ్యారని తెలిపారు. అవయవాలు లేవని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదన్నారు. చిన్న తనంలో కళ్ళు పోగోట్టుకుని సంఘర్షణ ద్వారా బ్రెయిలి లిపి కనుగొన్నారని అన్నారు. అన్ని రకాల సమస్యలు పరిష్కారిస్తామన్నారు. అంథులు సరైన బస్ స్టాప్ లలో దిగేవిధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేసేవిధంగా రవాణాశాఖ మంత్రితో మాట్లాడుతా అని తెలిపారు. అంథుల రిజర్వేషన్ పై ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్ట్ లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
