దిల్లీ, 11,,జనవరి (హిం.స)భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో రక్షణ మంత్రి బుధవారం 10 డౌనింగ్ స్ట్రీట్లో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ను కలిశారు. ఈ భేటీలో ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. చర్చల ఎజెండాలో రక్షణ, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలు ఉన్నాయి. దీంతోపాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)కు సంబంధించి కొనసాగుతున్న చర్చల పురోగతిపై కూడా మాట్లాడుకున్నారు. ప్రధాని సునక్తో పాటు, రాజ్నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ను కూడా కలిశారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్తో భారత్-యుకె సంబంధాలను పెంపొందించడం, ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడంపై ఆచరణాత్మక చర్చలు జరిగాయని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో రాశారు.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
