

కడప: 24 డిసెంబర్ (హిం.స)టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కడప పర్యటనకు వచ్చి నగర ప్రజలకు నరకయాతన చూపించారన్నారు.
పోలీసుల వలయంలో ముఖ్యమంత్రి పర్యటన సాగిందని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఇప్పటివరకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేసిన వాటిలో 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదని విమర్శించారు.
రైతుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకున్న జగన్.. కరువుతో అల్లాడుతున్న సొంత జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించలేదని శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
