మంగళగిరి, 20 ఆగస్టు (హి.స.)ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలనేదే తన నినాదమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశానని తెలిపారు.
మంగళగిరి మయూరి టెక్ పార్క్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. మంత్రులు నారా లోకేష్,టీజీ భరత్, నాదెళ్ల మనోహర్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమహేంద్ర వరం, అనంతపురము, తిరుపతిలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను వర్చ్యువల్ గా ప్రారంభించారు. స్టార్టప్ ల ప్రోత్సహం, కొత్త పారిశ్రామిక వేత్తలు.. ఇంటికో ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసింది. ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్టప్ కేంద్రంగా ఉండేలా కార్యచరణకు సిద్ధం చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశానికి ఏదైనా చేయాలని రతన్‌టాటా పరితపించేవారన్నారు. ఆయన భరతజాతి ముద్దుబిడ్డ అని కొనియాడారు. హైదరాబాద్ఐటీ అభివృద్ధికి రతన్‌టాటా తన సూచనలు నాతో పంచుకున్నారని పంచుకున్నారని తెలిపారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి
