న్యూఢిల్లీ: ,20 ఆగస్టు (హి.స.) ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)పై దాడి జరిగింది. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్‌వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాయి. తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను భాజపా దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఖండించారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
దిల్లీ సీఎం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో ప్రతివారం ‘జన్ సున్‌వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడు కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించాడు. అంతలోనే గట్టిగా అరుస్తూ సీఎంపై దాడి చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. ఊహించని పరిణామంతో ముఖ్యమంత్రి షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఆమెను వెంటనే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
