అమరావతి, 20 ఆగస్టు (హి.స):రాజధానిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను( Hub)ప్రారంభించటం ఓ చారిత్రాత్మక క్షణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు )వ్యాఖ్యానించారు. దేశానికి విలువైన సేవలు అందించిన పారిశ్రామిక వేత్త రతన్ టాటాను గౌరవించుకోవాలనే ఏపీ ఇన్నోవేషన్ హబ్‌కు రతన్ టాటా పేరు పెట్టామని ఉద్ఘాటించారు. అత్యంత నిరా పారిశ్రామిక వేత్తగా సంపద సృష్టించిన్ టాటా, తన పేరుతో టాటా ట్రస్టు పెట్టి దేశ ప్రజలకూ సేవలందించారని నొక్కిచెప్పారు. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంభించారని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
