ఢిల్లీ ,02, జనవరి (హిం.స) కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీబీఐ మరోసారి తాఖీదులు జారీ చేసింది. కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. దిల్లీలో తమ ముందు జనవరి 11న విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆ ఛానల్లో పెట్టుబడులు, వాటా వివరాలు తెలియజేయాలని తాఖీదుల్లో అధికారులు కోరారు. ఆదాయం కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు, దిల్లీలోని ఫ్లాట్లో రూ.8 కోట్ల పైచిలుకు నగదు దొరికిన వ్యవహారంలో శివకుమార్ ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారు.
హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్
