శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ నరసన్నపేట నియోజకవర్గంలో ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం పార్టీ నాయకులు, మద్దతుదారులు.. వచ్చి చేరుతూనే ఉన్నారు. వరుస పెట్టి తెలుగుదేశం నాయకులు పార్టీని వీడి వైసిపిలో కి చేరుతుండటంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పుల్ జోష్ మీద ఉన్నారు
బుధవారం నరసన్నపేట మండలం సుందర పురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సడగాన నందీశ్వరరావు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగనన్న.. దాసన్న కు మద్దతుగా పనిచేయాలని కోరారు. వీరంతా జగనన్న అభివృద్ధి.. సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైసీపీలో చేరినట్లు.. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల అనైతిక కూటమి కి వ్యతిరేకంగా తామంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరామని వీరు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్ జెడ్పీటీసీ చింతు రామారావు పిఎసిఎస్ అధ్యక్షులు పోన్నాన దాలినాయుడు తోపాటు మండల, పట్టణ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు పాగోటి గోవిందరావు, బుద్దల రాజశేఖర్ మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
