
ఆంధ్రప్రదేశ్ 23 డిసెంబర్ (హిం.స)ఇంటింటికీ బియ్యం పంపిణీ ప్రక్రియకు జగన్ మంగళం పాడారు. గ్రామాల్లోనే పాయింట్ల వారీగా సరకులు అందజేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో వాలంటీరుకు ప్రతి నెలా రూ.750 ఇచ్చి బియ్యం పంపిణీ బాధ్యతలు అప్పగించింది.
ఈ ప్రక్రియను జనవరి నుంచి ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. నిత్యావసరాల పంపిణీలో లోటుపాట్లను సవరించకుండా.. రానున్న ఎన్నికల తరుణంలో అధికార పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లకు మేలు చేసేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లుందని పలువురు మండిపడుతున్నారు. ఈ విధానంతో ఉమ్మడి జిల్లాపై ఏటా రూ.1.33 కోట్ల అదనపు భారం పడనుంది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
