న్యూఢిల్లీ, 19 ఆగస్టు (హి.స.)
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపిస్తుందని కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో యూరియా సమస్యను పరిష్కరించాలని ఇవాళ పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన చేపట్టారు. ఈ నిరసనకు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తెలంగాణ రైతాంగం హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని చెప్పారు. జీరో అవర్ లో యూరియా సమస్య లేవనెత్తుతామన్నారు.
యూరియా సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో సాగుతున్న ఆందోళన కార్యాచరణపై ఎంపీలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. యూరియా సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై గట్టిగా నిలదీయాలని ఎంపీలకు మంత్రి తుమ్మల సూచించారు. కాగా రాష్ట్రా రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు తక్షణమే తెలంగాణకు 3 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని నిన్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు కాంగ్రెస్ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
