
ఢీల్లీ, 23 డిసెంబర్ (హిం.స)
ఇక రోజుల వ్యవధిలోనే క్యాలెండర్ మారిపోనుంది. 2024 సంవత్సరం రంగ ప్రవేశం చేయనుంది. కొత్త వత్సరానికి ఆహ్వానం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందంటే చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అలాగే కొన్ని పనులు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే లోపే అంటే డిసెంబర్ 31లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్ సమర్పించడం, ఇన్ యాక్టివ్ యూపీఐ ఐడీలను డిలీట్ చేయడం, బ్యాంక్ లాకర్ల అగ్రిమెంట్ ను రెన్యూవల్ చేయడం, సిమ్ కార్డుల కోసం పేపర్ లెస్ కేవైసీ సమర్పించడం వంటివి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ 31లోపు పూర్తి చేయాల్సిన ఆర్థిక పనుల చెక్లిస్ట్ మీకు అందిస్తున్నాం. ఓ సారి తనిఖీ చేసుుకోండి..
డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్ నామినేషన్లు..
సెప్టెంబర్ 26న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇప్పటికే ఉన్న డీమ్యాట్ ఖాతాదారులకు నామినేషన్ దాఖలు చేసేందుకు మూడు నెలల పాటు డిసెంబర్ 31, 2023 వరకు పొడిగించింది. అలాగే ఫిజికల్ పాన్ సమర్పణ, నామినేషన్, కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, సంబంధిత ఖాతాల్లో సంతకాలను సమర్పించడానికి కూడా డిసెంబర్ 31 వరకూ సెబీ అవకాశం కల్పించింది.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
