విశాఖపట్నం, 18 జూలై (హి.స.)
:గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజుని(భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికిఅశోక్ గజపతిరాజురాజీనామా చేశారు. అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్‌కి ఈ లేఖను పంపించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు భావోద్వేగానికి గురయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని.. ఇన్నేళ్లు పార్టీలో ఉన్నానని ఉద్ఘాటించారు. పార్టీతో, నేతలతో ఉన్న మధుర క్షణాలని ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకిఅశోక్ గజపతిరాజు ఎంతగానో సేవలు అందించారని నేతలు కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని నేతలు ప్రశంసల వర్షం కురిపించారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
