ఆంధ్రప్రదేశ్ : అమరావతి: జనవరి 13( హింస)
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ రోజు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ఇప్పటికే చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది.. వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.. ఇక, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. నేడు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్న చంద్రబాబు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), లిక్కర్ స్కామ్, ఇసుక కుంభ కోణం కేసుల్లో పూచీకత్తు సమర్పించనున్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
