తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 22( హింస)
ఇవాళ అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కమిషనర్లు (సీఎస్‌పీ), పోలీసు సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. సున్నితమైన అన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. అలాగే, పక్కాగా బందోబస్త్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. స్థానిక పోలీసులకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP), గ్రే హౌండ్స్, సాయుధ రిజర్వ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు సహాయం అందిస్తాయని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మతపరమైన సున్నితమైన ప్రదేశాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉంది.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
