









లఖ్నవూ: 500 ఏళ్ల తర్వాత దేశ ప్రజల సుదీర్ఘకల సాకారం అవుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రామ్లల్లా దర్శనం కోసం విమానంలో లఖ్నవూ చేరుకున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున అయోధ్యకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పవన్ మీడియాతో మాట్లాడారు. రామ్లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగస్వామినయ్యే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు.
అయోధ్య రామమందిరం లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. తొలుత రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి మోదీ దర్శనం చేసుకోనున్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ రోజు సామాన్య భక్తులకు అనుమతి లేదు. జనవరి 23 నుంచి అందరికీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించనున్నారు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్
