ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. భూ కుంభకోణం కేసులో సీఎంను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు శనివారం ఆయన నివాసానికి వెళ్లారు.
కాగా.. ఇటీవల పశ్చిమబెంగాల్లో ఈడీ అధికారులపై దాడి నేపథ్యంలో వీరు కట్టుదిట్టమైన భద్రతతో సోరెన్ నివాసానికి వెళ్లడం గమనార్హం. వీరికి సీఐఎస్ఎఫ్ బలగాలు భద్రత కల్పించాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు బాడీ కెమెరాలను కూడా ధరించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కుంభకోణంలో సోరెన్కు సంబంధం ఉందంటూ ఈడీ తమ అభియోగాల్లో పేర్కొంది. ఆయనను ప్రశ్నించేందుకు గతంలో ఏడుసార్లు సమన్లు జారీ చేయగా.. విచారణకు సీఎం గైర్హాజరయ్యారు. ‘చివరి అవకాశం’గా పేర్కొంటూ ఇటీవల ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది.
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
