ఢిల్లీ : 18ఫిబ్రవరి జార్ఖండ్ నూతన సీఎం చంపాయ్ సోరెన్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మంత్రి పదవులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ముసలం పుట్టింది. ప్రస్తుతం క్యాబినెట్ బెర్తులు దక్కించుకున్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తొలగించి వారి స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తమ సమస్యను పార్టీ హైకమాండ్‌కు వినిపించేందుకు ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు.
