ఢిల్లీ లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని.. చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. వినోజ్ పి సెల్వమ్ను చెన్నై సెంట్రల్, వెల్లూర్ – ఏ.సీ షణ్ముగం, కృష్ణగిరి – సి. నరసింహన్, నీలగిరి(ఎస్సీ) – ఎల్ మురుగన్, కోయంబత్తూర్ – కే. అన్నామలై. పెరంబలూర్ – టీఆర్. పారివేందర్, తూతుక్కుడి – నైనార్ నాగేంద్రన్, కన్నియకుమారి – పోన్ రాధాకృష్ణన్. మూడో జబితాలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
